elections: ‘భూతద్దం’లో చూసి మరీ ఓటు వేయండి: ఓటర్లకు ఎన్నికల సంఘం సూచన

  • పోలింగ్‌ కేంద్రంలో తొలిసారి అందుబాటులో భూతద్దాలు 
  • వృద్ధుల కోసం ప్రత్యేక సదుపాయం
  • సిరా, పోలింగ్‌ చీటీలు, ఇతర సామగ్రితోపాటు ఏర్పాటు
పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్లలో ఎవరికైనా దృష్టి లోపం ఉండి అభ్యర్థి గుర్తును గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మరింత స్పష్టంగా చూసేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈసారి పోలింగ్‌ కేంద్రాల్లో ‘భూతద్దం’ను అందుబాటులో ఉంచుతోంది. సిరా, పోలింగ్‌ చీటీలు, తదితర పోలింగ్‌ సామగ్రితోపాటు భూతద్దం కూడా ఉంటుందని, అవసరమైన వారు వినియోగించుకోవచ్చునని సూచించింది.

 వయసుతోపాటు వచ్చే దృష్టిలోపం వల్ల కొందరు వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. గుర్తును సరిగ్గా గుర్తించలేకుంటే వేరే వారికి ఓటువేసే ప్రమాదం ఉంది. ఈ సమస్యను గుర్తించి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక భూతద్దం అందుబాటులో ఉంచుతున్నామని, అవసరమైన వారు ప్రిసైడింగ్‌ అధికారిని అడిగి తీసుకోవచ్చని సూచించింది.  ఈ అద్దాన్ని ఉపయోగించి గుర్తులను పెద్దవిగా చూడవచ్చునని, తాము వేయాల్సిన గుర్తును గుర్తించవచ్చని తెలిపింది. అంధుల కోసం కూడా ఈసారి ఎన్నికల సంఘం ప్రత్యేక సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే.
elections
magnifing glass
poling station
elders

More Telugu News