Uttar Pradesh: ‘ముస్లింలు కాంగ్రెస్కు ఓటేయవద్దు’ అన్న మాయావతి వ్యాఖ్యలపై ఈసీ దృష్టి
- యూపీలోని దియోబంద్ ర్యాలీలో మాట్లాడిన బీఎస్పీ చీఫ్
- ముస్లిం ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపణ
- ప్రసంగంపై నివేదిక పంపాలని ఆదేశించిన ఎన్నికల సంఘం
‘ముస్లింలు కాంగ్రెస్కు ఓటు వేయవద్దు’ అన్న మాయావతి వ్యాఖ్యలపై ఈసీ దృష్టిసారించింది. ఉత్తరప్రదేశ్లోని దియోబంద్లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాట్లాడుతూ మహాకూటమిని ఓడించే లక్ష్యంతో ముస్లిం ఓట్లలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీ ఎత్తుగడకు చిక్కవద్దని, ముస్లింలు ఎవరూ కాంగ్రెస్కు ఓటు వేయవద్దని కోరారు.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే సామర్థ్యం లేదని, మహాకూటమి వల్లే అది సాధ్యమవుతుందని, అందువల్ల కాంగ్రెస్కు ఓటేయవద్దని ఆమె ఈ ర్యాలీలో కోరారు. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో స్పందించిన ఎన్నికల సంఘం ఆమె ప్రసంగానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది.