India: రామమందిరాన్ని కడతాం.. ఆర్టికల్ 370ను రద్దు చేస్తాం.. మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ!

  • రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం
  • వ్యవసాయ, గ్రామీణ రంగాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు
  • జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు

2019 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో ‘సంకల్ప్ పత్రం’ పేరుతో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు ఆర్టికల్ 370 రద్దు, చిన్న-సన్నకారు రైతులకు పెన్షన్, వడ్డీ లేకుండా వ్యవసాయ రుణాలు సహా పలు హామీలను గుప్పించింది. ఈ మేనిఫెస్టోలోని ఇతర కీలక అంశాలు ఇవే.

  • రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటాం
  • జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370, 35 ఏ రద్దు
  • చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్లు
  • రైతులకు ఏటా రూ 6000 పెట్టుబడి సాయం


  • కిసాన్‌ సమ్మాన్‌ యోజన విస్తరణ  
  • వ్యవసాయం, గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ  
  • రైతులకు వడ్డీ లేకుండా రుణాలు
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు


  • గుర్తింపు పొందిన వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు  
  • ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ను ఒకటిగా తీర్చిదిద్దడం
  • ఉగ్రవాదంపై రాజీలేని పోరు
  • 2022 నాటికి మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు

  • చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
  • 2022 నాటికి హైవేలను రెట్టింపు చేయడం
  • జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
  • అందరికీ అందుబాటులో విద్య
  • సైనిక బలగాలను బలోపేతం చేయడం
  • దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు
  • రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు, 

  • Loading...

More Telugu News