Kutumba Rao: రైతు రుణమాఫీలో భాగంగా రూ.3,900 కోట్ల నిధులు విడుదల చేశాం: కుటుంబరావు
- రూ.39 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ
- 30 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి
- సుఖీభవ నిధులను కూడా ఖరీఫ్లోగా ఇస్తాం
- మే 23లోపు ఐదో విడత రుణమాఫీ
ఏపీ ప్రభుత్వం రైతుల కోసం రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసింది. నాలుగో విడత రుణమాఫీలో భాగంగా ఈ నిధులను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ.39 వేల చొప్పున 30 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. సుఖీభవ నిధులను కూడా ఖరీఫ్లోగా ఇస్తామన్నారు.
మే 23 లోపు ఐదో విడత రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. రైతు గుర్తింపు పత్రాలు, తన రుణ అర్హతకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో సమర్పించాలని కుటుంబరావు సూచించారు. రైతులు రుణ అర్హత పత్రాన్ని బ్యాంకులో నమోదు చేస్తే వడ్డీతో సహా ఇస్తారని ఆయన వెల్లడించారు.
దీంతో పాటు ఇప్పటికే పసుపు-కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు కుటుంబరావు తెలిపారు.