Chandrababu: కేసీఆర్ చేసిన కుట్రనే చేయబోయిన జగన్ బొక్క బోర్లాపడ్డాడు: చంద్రబాబు

  • తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారు
  • ఏపీలోనూ అదే చేయాలని జగన్ భావించాడు
  • సేవామిత్ర యాప్ పై అందుకే దాడి చేయించారు
  • గెలిచేది టీడీపీయేనన్న చంద్రబాబునాయుడు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరని భావించిన వారికి సంబంధించిన 25 లక్షల ఓట్లను కేసీఆర్ తొలగించారని, అదే కుట్రను ఏపీలో అమలు చేయబోయిన వైఎస్ జగన్, బొక్క బోర్లా పడ్డాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ పై జరిగిన దాడి జగన్ కోసం కేసీఆర్ చేయించినదేనని మండిపడ్డారు. 'ఎలక్షన్ మిషన్ 2019' టెలికాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన, డేటా సమాచారాన్ని దొంగిలించి జగన్ కు అందించడం సైబర్ నేరమని ఆరోపించిన చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల్లో హోదాను వ్యతిరేకించిన కేసీఆర్, ఇప్పుడు జగన్ కోసం నాటకాలు ప్రారంభించారని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి ఎదురుగాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలోని ప్రజలు మాత్రం టీడీపీ వైపున్నారని అన్నారు. ఎన్నో సర్వేలు ఈ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకి అనుకూలమని చెబుతున్నాయని గుర్తు చేశారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న కేసీఆర్ వంటి వ్యక్తితో కలిసిన జగన్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Chandrababu
Jagan
KCR
Teleconference

More Telugu News