Kurnool District: బనగానపల్లెలో ఉద్రిక్తత..టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి!
- స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఘటన
- పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గీయులు
- టీడీపీ కార్యకర్తకు గాయాలు
కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త గోపాల్ గాయపడినట్టు తెలుస్తోంది. ఇరు వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలపైన లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.