secunderabad: సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు!

  • ఈరోజు నుంచి 15 వరకు ప్రత్యేక రైళ్లు
  • సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లు
  • ఎల్లుండి రాత్రి నర్సాపూర్ - సికింద్రాబాద్ కు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు
ఓటు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లి వచ్చే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు డీఆర్ఎం ధనుంజయులు తెలిపారు. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లను ఏర్పాటు చేశారు.

ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ రైళ్లు బయలుదేరతాయి. విజయవాడ నుంచి రాత్రి  8.25 గంటలకు ఈ రైళ్లు తిరిగి బయలు దేరి సికింద్రాబాద్ వస్తాయి. కాగా, ఎల్లుండి రాత్రి 7.30 గంటలకు నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును రైల్వేశాఖ నడపనుంది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్నట్టు తెలిపింది.
secunderabad
vijayawada
special trains

More Telugu News