konda vishveshwar reddy: 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వరరెడ్డి
- చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి
- టీఆర్ఎస్ రిగ్గింగ్ చేసినా... తనదే గెలుపు అంటూ ధీమా
- టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొండా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2 లక్షల మెజార్టీతో గెలుపొందుతానని చెప్పారు. టీఆర్ఎస్ రిగ్గింగ్ చేసినా... తనకు గెలుపు ఖాయమని చెప్పారు. రెండో స్థానం కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడతాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి విశ్వేశ్వరరెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే.