Andhra Pradesh: ఈవీఎంలలో సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ ప్రూఫే అయితే, ఆ వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • పబ్లిక్ డొమైన్ లో ఉంచితే ట్యాంపరింగ్ కు యత్నిస్తారు
  • ఆ సాఫ్ట్ వేర్ పటిష్టమైందో, కాదో తేలిపోతుంది
  • ట్యాంపరింగ్ జరిగితే అలా జరగకుండా జాగ్రత్త పడొచ్చు

ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురవుతాయా లేదా అన్న విషయం తెలియాలంటే, అందులో వినియోగించే సాఫ్ట్ వేర్ ఏంటో తెలియాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలలో వినియోగించే సాఫ్ట్ వేర్ గురించి తాము ఎలా బయటపెడతామని ఎన్నికల కమిషన్ ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ సాఫ్ట్ వేర్ తయారు చేసింది మనుషులే కదా, ఎవరో ఒకరు దీన్ని లీక్ చేయరన్న గ్యారంటీ లేదని, ఒకవేళ లీక్ అయితే, మరింతగా ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెడితే ఔత్సాహికులు దాన్ని ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారని, తద్వారా ఆ సాఫ్ట్ వేర్ పటిష్టమైందో, కాదో తేలిపోతుందని అన్నారు.

ఒకవేళ ట్యాంపరింగ్ జరిగితే అలా జరగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయని సూచించారు. ఈవీఎంలలో సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ ప్రూఫే అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడానికి ఇబ్బందేమిటి? ప్రజల్లో ఇలాంటి విశ్వాసాన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు కల్పించలేకపోతోంది? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News