Congress: పకోడీ వ్యాపారమా? ఉద్యోగాలా? మీరే నిర్ణయించుకోండి: కాంగ్రెస్

  • ఈ ఎన్నికలు అత్యంత కీలకం
  • మీకోసం మీరు ఓటేయండి
  • యువతకు కాంగ్రెస్ సూచన

ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని, యువత తమకు పకోడీ వ్యాపారం కావాలో, ఉద్యోగాలు కావాలో తెలివిగా నిర్ణయించుకుని ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. "ద్వేషం కావాలో ప్రేమ కావాలో నేడు మీరు నిర్ణయించుకోవాలి. ఉద్యోగాలా? పకోడీలా? కాంగ్రెస్ కు ఓటు వేయండి. మీకోసం మీరు ఓటు వేయండి" అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాగా, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత పెద్దఎత్తున పోలింగ్ బూత్ నకు తరలిరావాలని కోరారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఈ ఉదయం నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, "2 కోట్ల ఉద్యోగాలు లేవు. బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు పడలేదు. మంచి రోజులు లేవు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ టాక్స్ తో ఎంత నష్టమో. ఇప్పుడున్నది సూట్, బూట్ సర్కారు. ఎన్నో చోట్ల ద్వేషపూరితం. భరతమాతను కాపాడేందుకు నేడు ఓటు వేయండి. ఇదే మీ భవిష్యత్తు. తెలివిగా ఓటేయండి" అని అన్నారు.

  • Loading...

More Telugu News