Vijayawada: విజయవాడలోని మొగల్రాజపురంలో ఏడు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం

  • అసంతృప్తి వ్యక్తం చేసిన ఓటర్లు
  • ఓటు వేసేందుకు ఆసక్తి కనబరచని ఓటర్లు
  • గుంటూరు జిల్లాలోని బోడిపాలెంలోనూ ఇదే పరిస్థితి
విజయవాడలోని మొగల్రాజపురంలో చాలా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు ఏడు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో, ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి కనబరచలేదు. ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని బోడిపాలెంలో ఈవీఎంలు మొరాయించడంతో, 267వ పోలింగ్ కేంద్రంలో ఇప్పటివరకూ పోలింగ్ ప్రారంభం కాలేదు. కొత్త ఈవీఎంలను తీసుకురాకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం సమీపిస్తున్నప్పటికీ కొత్త ఈవీఎంలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
Vijayawada
mogalrajapuram
poling
guntur

More Telugu News