Telangana: ఎన్నికలను బహిష్కరించిన తెలంగాణ గ్రామం.. మున్సిపాలిటీలో ఊరిని కలపడంపై ఆగ్రహం!

  • సిరిసిల్ల నియోజకవర్గంలోని అయ్యోరుపల్లె ప్రజల నిర్ణయం
  • తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం
  • అధికారులు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేళ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వేములవాడ మండలంలోని అయ్యోపరుపల్లె గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలకు మూకుమ్మడిగా ఓటింగ్ కు దూరమయ్యారు. తమ గ్రామాన్ని వేములవాడ మున్సిపాలిటీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని ఎన్నికల అధికారులు గ్రామస్తులకు పలుమార్లు  విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు సైతం మౌనంగా ఉండిపోయారు. గతేడాది జూలైలో తిప్పాపూర్, నాంపల్లి, కోనాయిపల్లె, శాత్రాజు పల్లె, అయ్యోరుపల్లె గ్రామాలను వేముల మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం కలిపింది.
Telangana
Rajanna Sircilla District
boycott
loksabha election

More Telugu News