sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ రోజున ఒడిదుడుకులు
- చివరకు స్వల్ప లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- 22 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, మార్కెట్లు ఉదయం నుంచి స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతూ, చివర్లో లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 22 పాయింట్లు లాభపడి 38,607కు పెరిగింది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 11,597 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.19%), బజాజ్ ఆటో (1.76%), బజాజ్ ఫైనాన్స్ (1.56%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.29%), టాటా మోటార్స్ (1.18%).
టాప్ లూజర్స్:
వేదాంత (-3.72%), ఇన్ఫోసిస్ (-1.46%), సన్ ఫార్మా (-1.38%), టాటా స్టీల్ (-1.30%), టీసీఎస్ (-1.21%).