Mamata banerjee: సినిమాను నిలిపివేసిన మమత ప్రభుత్వం.. రూ.20 లక్షల జరిమానా విధించిన సుప్రీంకోర్టు
- ‘భోబిష్యోటర్ భూత్’ సినిమాను ఆపేసిన మమత ప్రభుత్వం
- రాజకీయాలపై ప్రభావం చూపుతుందని ఆరోపణ
- సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
పొలిటికల్ సెటైర్ చిత్రం పేరుతో ఓ సినిమా విడుదలను అడ్డుకున్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.20 లక్షల జరిమానా విధించింది. అనిక్ దత్తా దర్శకత్వంలో రూపొందించిన ‘భోబిష్యోటర్ భూత్’ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, రాజకీయాలపై ఈ సినిమా ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల నుంచి దీనిని తొలగించింది. దీంతో చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. భావ వ్యక్తీకరణ విషయంలో ప్రజలకు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న న్యాయస్థానం.. సినిమా విడుదలను ఆపినందుకు గాను రూ.20 లక్షల జరిమానా విధించింది. థియేటర్ యజమానులకు, ఆ సినిమా నిర్మాతకు దానిని ఇవ్వాలని ఆదేశించింది.