Nara Lokesh: సాక్షి సిబ్బంది, వైసీపీ గూండాలు నాపై దాడి చేశారు: నారా లోకేశ్
- వైసీపీ ఓటమి ఖాయం
- జీర్ణించుకోలేకపోతున్న పార్టీ
- ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న లోకేశ్
తాము ఓడిపోతామన్న నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లో ఈసీ సాయంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, "ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను నరికేశారు. తాడేపల్లి క్రిష్టియన్ పేటలో నాపై దాడికి దిగారు. ఇందుకేనా? నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటున్నారు మీ రౌడీలు, గూండాలు" అంటూ తీవ్రంగా విమర్శించారు.
ఆ తరువాత "వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ ఓటుపై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక అభ్యర్థిగా ప్రజలకు ఓటుహక్కు కల్పించాలి అని నిరసన తెలిపాను. ముందుగా ప్లాన్ చేసుకున్న సాక్షి సిబ్బంది, వైకాపా గూండాలు నాపై దాడి చేశారు" అని అన్నారు.
ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను నరికేశారు. తాడేపల్లి క్రిష్టియన పేటలో నాపై దాడికి దిగారు. ఇందుకేనా? నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటున్నారు మీ రౌడీలు, గూండాలు.
— Lokesh Nara (@naralokesh) April 11, 2019
వైకాపా ఒత్తిడితో ఎన్నికల కమిషన్ ఓటు పై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒక అభ్యర్థిగా ప్రజలకు ఓటుహక్కు కల్పించాలి అని నిరసన తెలిపాను. ముందుగా ప్లాన్ చేసుకున్న సాక్షి సిబ్బంది, వైకాపా గూండాలు నాపై దాడి చేశారు.
— Lokesh Nara (@naralokesh) April 11, 2019