uk: బ్రిటన్ లో స్మార్ట్ దొంగలు.. జేసీబీతో ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి చోరీ!
- ఉత్తర ఐర్లాండ్ లోని డంగివెన్ లో ఘటన
- ఏటీఎం కొట్టేసేందుకు జేసీబీ వినియోగం
- కారులో ఏటీఎం మెషీన్ తో పరారీ
సాధారణంగా దొంగలు అన్నాక చిన్నచిన్న వస్తువులు కొట్టేస్తూ ఉంటారు. కొందరు పెద్ద దొంగలైతే ఏకంగా షాపులకే కన్నాలు వేస్తుంటారు. మరికొందరు బ్యాంకుల్లోని సొత్తును చాకచక్యంగా ఎత్తుకుపోతుంటారు. బ్రిటన్ లోని ఉత్తర ఐర్లాండ్ లో మాత్రం విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి డంగివెన్ ప్రాంతంలో ఉన్న ఏటీఎంపై కొందరు దొంగలు కన్నేశారు.
అయితే ఏటీఎంను బయటకు తీయాలంటే చాలా కష్టపడాలని భావించారో, ఏమో ఓ జేసీబీని ముందుగా దొంగలించారు. దాన్ని అర్ధరాత్రి తీసుకొచ్చి ఏటీఎం అమర్చిన షాపును ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను బయటకు తీశారు. దాన్ని ఓ ట్రక్కులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. మరోవైపు ఈ దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి దొంగతనాన్ని ఎప్పుడైనా చూశారా?#ATMRobbery pic.twitter.com/wtCqzG9mhX
— BBC News Telugu (@bbcnewstelugu) April 13, 2019