Telangana: తెలుగురాష్ట్రాల్లో మంగళవారం వరకూ వర్షాలు!
- నేడు ఉష్ణోగ్రత అధికం
- ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వర్షాలు
- వెల్లడించిన వాతావరణ శాఖ
వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. నేడు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే, 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కావచ్చని ఓ అధికారి తెలిపారు. మంగళవారం వరకూ వర్షాలకు ఛాన్స్ ఉందని, ఉత్తర కోస్తాంధ్రలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని, దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.