Child: 110 అడుగుల లోతున్న బోరు బావి నుంచి ఐదేళ్ల చిన్నారి సురక్షితంగా బయటకు!

  • మృత్యుంజయుడిగా నిలిచిన చిన్నారి
  • సైన్యం సాయంతో బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్

ఈ చిన్నారి నిజంగా మృత్యుంజయుడే. 110 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయి కూడా ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధురలో జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఈ చిన్నారిని కాపాడారు.

"ఐదేళ్ల బాలుడు నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో 100 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించి, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాం. కేవలం రెండు గంటల వ్యవధిలోనే చిన్నారిని చేరుకుని, సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం.ఈ ఆపరేషన్ లో సైన్యం ఎంతో సహకరించింది" అని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.

విషయం తమకు తెలియగానే రంగంలోకి దిగామని ఆయన అన్నారు. చిన్నారికి ఏ విధమైన ప్రమాదం లేదని, ప్రస్తుతం అతన్ని ఆసుపత్రిలో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, నేడు డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఓ చెట్టు నుంచి జారి పడిన పళ్లను ఏరుకునే క్రమంలో బాలుడు బావిలో పడిపోయాడని తెలిపారు.



  • Loading...

More Telugu News