Andhra Pradesh: ద్వివేదీ పేరును చంద్రబాబే ప్రతిపాదించారు.. ఇప్పుడు ఆయన్నే తిడతారా?: వైసీపీ నేత రవీంద్రబాబు

  • టీడీపీ నేతలకు ఓడిపోతామని భయం పట్టుకుంది
  • అందుకే తమ కోపాన్ని ఈవీఎంలపై చూపుతున్నారు
  • 2014లో ఈ విషయంపై బాబు ఎందుకు మాట్లాడలేదు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలెవరూ ఈవీఎంలపై ఫిర్యాదు చేయలేదని వైసీపీ నేత పండుల రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు ఓడిపోతామన్న భయం పట్టుకుందని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు తన కోపాన్ని ఈవీఎంలపై చూపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడలో ఈరోజు రవీంద్ర బాబు మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలో చంద్రబాబు తీరు చూస్తుంటే మే 23న ఫలితాలకు ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఓటేసిన ప్రజలను, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని చంద్రబాబు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఈవీఎంలు ఇంతకన్నా దారుణంగా మొరాయించాయనీ, అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని రవీంద్రబాబు ప్రశ్నించారు..

ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా వద్దు, గోపాలకృష్ణ ద్వివేదీ కావాలంటూ ఆయన పేరు పంపింది చంద్రబాబేనని రవీంద్రబాబు స్పష్టం చేశారు. ద్వివేదీ రాష్ట్ర స్థాయి కేడర్ అధికారి అనీ, సొంత అధికారిని ఎవరైనా తిడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ఏపీ ప్రజలంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News