Pithapuram: మహిళల్లో సైలెంట్ ఓటింగ్ ఉంది.. నాకు 25 వేలకు పైగా మెజారిటీ వస్తుంది: టీడీపీ అభ్యర్థి వర్మ ధీమా

  • సంక్షేమ పథకాలతో సానుకూలత
  • స్థానికత్వం ప్రజల్లోకి ప్రబలంగా వెళ్లింది
  • అభివృద్ధి పనుల కారణంగా గెలవడం ఖాయం

మహిళల్లో సైలెంట్ ఓటింగ్ ఉందని, తనకు 25 నుంచి 32 వేల వరకూ మెజారిటీ వస్తుందని పిఠాపురం టీడీపీ అభ్యర్థి వర్మ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచాయన్నారు.

అలాగే పిఠాపురం గడ్డపై పుట్టిన వ్యక్తి అయిన తనకే ఓటు వేయాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు బుద్ధి చెప్పాలంటూ తాను చేసిన ప్రచారం ప్రజల్లోకి ప్రబలంగా వెళ్లిందని వర్మ పేర్కొన్నారు. అయిదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం, 72 వేల ఎకరాలకు నీరందించటం తదితర పనులన్నీ ప్రజల్లో సానుకూలత తెచ్చాయన్నారు. వీటన్నింటి కారణంగా తాను గెలవడం ఖామయని, 25 వేలకు పైగా మెజారిటీ సాధిస్తానని వర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News