Larsen and Tubro: ఉద్యోగార్థులకు తీపి కబురు అందించిన ఎల్అండ్టీ
- ప్రపంచ వ్యాప్తంగా 22వ ర్యాంక్
- 1500 మంది కొత్తవారికి అవకాశం
- మహిళా ఉద్యోగుల అభివృద్ధికి కృషి
దేశంలోనే అత్యుత్తమ యజమానిగా 2018లో ఫోర్బ్స్ చేత గుర్తించబడిన ఇన్ఫ్రా రంగ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. దాదాపు 60 దేశాల్లోని వివిధ సంస్థలతో పోటీపడి ప్రపంచ వ్యాప్తంగా 22వ ర్యాంక్‌లో నిలిచిన ఎల్అండ్టీ ప్రస్తుతం 1500 మంది కొత్తవారికి అవకాశం కల్పించనుంది.
ఎల్అండ్టీ కార్పొరేట్ విభాగం హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ యోగి శ్రీరామ్ మాట్లాడుతూ, మార్చి 31 నాటికి తమ కంపెనీలో 42,924 మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల తగ్గింపు రేటు ఎల్అండ్టీలో అతి తక్కువగా 5 శాతం మాత్రమే ఉందని తెలిపారు. తాము ఏటా తమ సంస్థలో అదనంగా 1500 మందిని చేర్చుకుంటామని తెలిపారు. అదే సంప్రదాయాన్ని ఇప్పుడూ కొనసాగిస్తున్నామని, తాము మహిళా ఉద్యోగుల అభివృద్దికి సైతం కృషి చేస్తామని యోగి శ్రీరామ్ స్పష్టం చేశారు.