France: పారిస్ లోని 12వ శతాబ్దానికి చెందిన చర్చిలో అగ్నిప్రమాదం.. కుప్పకూలిన వైనం!
- నోటర్ డామ్ కేథడ్రల్ చర్చిలో మంటలు
- పూర్తిగా కాలిపోయిన ప్రార్థనామందిరం
- ఆధునికీకరణ పనుల్లో అపశ్రుతి
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోటర్ డామ్ కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైపోయింది. ఫ్రాన్స్ లోని పారిస్ మహానగరంలో ఉన్న ఈ 12వ శతాబ్దపు అత్యంత పురాతన ప్రార్థనమందిరం మంటల ధాటికి కుప్పకూలిపోయింది. ఈ చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది వ్యవధిలోనే మంటలు చర్చిని చుట్టుముట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే అత్యధిక భాగం దగ్ధమైంది. దాంతో చర్చి కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గుర్తించారు. చర్చి చుట్టుపక్కల నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.