Tamilnadu: ఈసీ అనూహ్య నిర్ణయం... వేలూరు లోక్ సభ ఎన్నిక రద్దు యోచన!
- రాష్ట్రపతికి సిఫార్సు చేయనున్న ఈసీ
- నేడు నివేదిక పంపనున్న అధికారులు
- డీఎంకే అభ్యర్థి నుంచి కోట్ల రూపాయలు స్వాధీనం
తమిళనాడులోని వేలూరు లోక్ సభ ఎన్నికను రద్దు చేయాలని ఈసీ అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వేలూరులో వందల కోట్ల రూపాయలు ఒకే చోట లభించడంతో, ఈ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నట్టు భావిస్తున్న ఈసీ, ఎన్నిక రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయనుందని, ఇప్పటికే ఈ దిశగా ఓ నివేదికను తయారు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నివేదికను రాష్ట్రపతికి నేడు ఈసీ పంపనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితం డీఎంకే అభ్యర్థికి చెందిన కార్యాలయం నుంచి భారీ మొత్తంలో డబ్బును ఈసీ స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో డీఎంకే అభ్యర్థి కతియార్ ఆనంద్ పై కేసు కూడా నమోదైంది.