renu desai: నేను పుట్టినప్పుడు మా నాన్న నన్ను చూడటానికి హాస్పిటల్ కి రాలేదు: రేణు దేశాయ్
- మగపిల్లాడు పుట్టాలని నాన్న అనుకున్నారు
- నేను పుట్టడం అమ్మకి కూడా సంతోషాన్ని కలిగించలేదు
- నన్ను కన్నందుకు గర్వంగా ఉందని నాన్న అన్నారు
రేణు దేశాయ్ కి స్వతంత్ర భావాలు ఎక్కువ. బంధాలకు .. అనుబంధాలకు ఆమె ఇచ్చే విలువ ఎక్కువ. ప్రతి ఆలోచనను సున్నితంగా ఆవిష్కరించడం ఆమె నైజం. అదే ఆమె కవిత్వంలోనూ కనిపిస్తుంది .. ఆమె మాటల్లోను వినిపిస్తుంది. అలాంటి రేణు దేశాయ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "నేను పుట్టినప్పుడు మా నాన్నగారు నన్ను చూడటానికి హాస్పిటల్ కి రాలేదు.
నా కంటే ముందు మా అక్కయ్య వుంది .. ఆమె తరువాత అబ్బాయి పుట్టాలని నాన్నగారు అనుకున్నారు .. కానీ నేను పుట్టాను .. మళ్లీ అమ్మాయే పుట్టిందని తెలిసి ఆయన రాలేదు. మళ్లీ అమ్మాయే పుట్టడమనేది మా అమ్మకి కూడా సంతోషాన్ని కలిగించలేదు. ఒక రకంగా నేను పుట్టడమనేది అమ్మానాన్నలిద్దరికీ బాధను కలిగించిన విషయం. ఆ తరువాత నేను ఎదిగిన తీరు .. నా ఆలోచనా విధానం చూసి, నన్ను కన్నందుకు గర్వంగా ఉందని మా నాన్నగారు అన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.