prabhudeva: ఉత్కంఠను రేపుతోన్న 'అభినేత్రి 2' టీజర్
- గతంలో విజయం సాధించిన 'అభినేత్రి'
- సీక్వెల్ గా వస్తోన్న 'అభినేత్రి 2'
- దెయ్యం పాత్రలో ప్రభుదేవా
తమిళంలో ఇంతకుముందు తమన్నా ప్రధాన పాత్రధారిగా 'దేవి' అనే హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమా 'అభినేత్రి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోనే కాకుండా ఈ సినిమా హిందీలోనూ సక్సెస్ అయింది. దాంతో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సినిమాకి సీక్వెల్ చేశాడు. 'అభినేత్రి 2' పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈ సారి ఈ సినిమాలో తమన్నాతో పాటు నందిత శ్వేత కనిపించనుండటం విశేషం.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రభుదేవా .. తమన్నా .. నందిత శ్వేత .. కోవై సరళకి సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. తమన్నాతో పాటు ప్రభుదేవా కూడా ఈ సినిమాలో దెయ్యంగా కనిపించనున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. 'ఒక దెయ్యం కాదయ్యా .. రెండు దెయ్యాలు' అని కోవై సరళ చెప్పడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటిభాగానికి మించిన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి