sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- 370 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 97 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- మార్కెట్లోకి వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుందనే వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 370 పాయింట్లు లాభపడి 39,276కు చేరుకుంది. నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 11,787కు ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.58%), ఓఎన్జీసీ (2.49%), ఎల్ అండ్ టీ (1.82%), మారుతి సుజుకి (1.74%).
టాప్ లూజర్స్:
ఎస్ అండ్ పీ సెన్సెక్స్ లో కేవలం మూడు కంపెనీలు... పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.63%), ఇన్ఫోసిస్ (-0.39%), టాటా మోటార్స్ (-0.22%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.