Guntur District: ఇనిమెట్ల ఘటనలో కోడెలపై కేసు నమోదు
- పోలింగ్ రోజున ఇనిమెట్ల బూత్ లోకి వెళ్లిన కోడెల
- కోడెల సహా మరో 22 మందిపై కేసు
- 8 సెక్షన్ల కింద కేసు నమోదు
ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజక వర్గంలోని ఇనిమెట్ల బూత్ లో ఘటన నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల సహా మరో 22 మందిపై 8 సెక్షన్ల కింద రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 188, 143, 341, 448, 506, ఆర్/ డబ్ల్యు 149, ఐపీసీ 131, 132 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా, ఆ బూత్ లో గంటన్నరపాటు కూర్చున్న కోడెల, ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు.