Andhra Pradesh: ఎన్నికల ఫలితాల కోసం సమయం వృథా చేయదలచుకోలేదు: సీఎం చంద్రబాబు
- ప్రజల అవసరాలు, రాష్ట్రాభివృద్ధి నాకు ముఖ్యం
- ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా జిల్లాలకు సరఫరా
- తాగునీటి సరఫరాలో ప్రజా సంతృప్తి స్థాయి నూరు శాతం కనిపించాలి
ఏపీలో తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, ఫలితాల కోసం సమయం వృథా చేయదలచుకోలేదని, ప్రజల అవసరాలు, రాష్ట్రాభివృద్ధి తనకు ముఖ్యమని అన్నారు. రోజూ 15 వేల ట్రిప్పులు చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేయాలని, ప్రజా సంతృప్తి స్థాయి నూరు శాతం కనిపించాలని ఆదేశించారు. పూర్తయిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.