Vizag: స్నేహితురాలి సాయంతో జ్యోత్స్న ఫోన్ ను అన్ లాక్ చేసిన పోలీసులు... లెక్చరర్, ఫ్యాకల్టీ అరెస్ట్!
- గతంలో జ్యోత్స ఫోన్ ను వాడిన ఫ్రెండ్
- అన్ లాక్ ప్రాట్రన్ తెలుసుకున్న పోలీసులు
- పోలీసుల అదుపులో ఫ్యాకల్టీ అంకుర్
విశాఖలో తీవ్ర కలకలం రేపిన బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, విచారణను కీలక దశకు తీసుకువచ్చారు. జ్యోత్స్న ఫోన్ ను గతంలో ఆమె స్నేహితురాలు పలుమార్లు వాడిందని, ఆ ఫోన్ నుంచి కాల్స్ కూడా చేసేదని గుర్తించిన పోలీసులు, ఫోన్ అన్ లాక్ ప్యాట్రన్ ను ఆమె నుంచి సంపాదించి, విశ్లేషించారు.
ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితులను విచారించిన అధికారులు, ఫ్యాకల్టీ అంకుర్, కాలేజీ లెక్చరర్ ను అరెస్ట్ చేసి, వారిని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ లెక్చరర్ కు ఈ కేసుతో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ కేసులో అసలు నిజాన్ని వెలుగులోకి తెస్తామని పోలీసులు అంటున్నారు. జ్యోత్స్న సెల్ ఫోన్ లోని డేటాను సేకరిస్తున్నామని అన్నారు.