chinajeeyaruswamy: చినజీయర్‌ స్వామి 'కులాల' వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి: కంచ ఐలయ్య డిమాండ్

  • ఇటువంటి మాటలు రాజ్యాంగ విరుద్ధం
  • ఇది రాజద్రోహం కంటే నేరం
  • చర్యలు తీసుకోకుంటే ఆయన ఆశ్రమం ముందు నిరసన

కుల రహిత సమాజాన్ని స్థాపించాలని భారత రాజ్యాంగం చెబుతుంటే, దేశంలో కులాలు, మతాలు ఉండాలని పీఠాధిపతి చినజీయర్‌స్వామి వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆచార్య కంచె ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజద్రోహం కంటే నేరమని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చినజీయర్‌ స్వామి కులాలు, మతాలు ఉండాలని వ్యాఖ్యానించారంటూ, అందుకు నిరసనగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్‌కే, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐలయ్య మాట్లాడుతూ వర్ణవ్యవస్థ ఉండాలని చెప్పిన చినజీయరు స్వామిపై చర్యలు తీసుకోకుంటే ఆయన ఆశ్రమం ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతను పక్కనపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చినజీయరు స్వామి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేయడం దారుణమన్నారు. 

  • Loading...

More Telugu News