varun tej: 'వాల్మీకి' షూటింగులో జాయినైన వరుణ్ తేజ్
- మాస్ డైరెక్టర్ గా హరీశ్ శంకర్ కి పేరు
- ఈ సారి కామెడీ టచ్ వున్న కంటెంట్
- తమిళ హిట్ మూవీకి రీమేక్
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరుగా కనిపిస్తాడు. 'మిరపకాయ్' .. 'గబ్బర్ సింగ్' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' .. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలు, పుష్కలంగా మాస్ అంశాలను అందిస్తూ విజయాలను సాధించాయి. అలాంటి హరీశ్ శంకర్ ఈసారి గ్యాంగ్ స్టర్ కామెడీ నేపథ్యంలో తమిళంలో వచ్చిన 'జిగర్తాండ'ను, తెలుగులో 'వాల్మీకి' టైటిల్ తో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు.2014లో తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' సినిమాలో బాబీసింహా .. సిద్ధార్థ్ నటించారు. తెలుగు రీమేక్ లో బాబీసింహా పాత్ర కోసం వరుణ్ తేజ్ ను తీసుకున్నారు. సిద్ధార్థ్ పాత్ర కోసం అథర్వ మురళిని ఎంపిక చేసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్ర కోసం మృణాళిని రవిని తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో మొదలుపెట్టారు. వరుణ్ తేజ్ ఈ షూటింగులో జాయిన్ అయ్యాడు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను 35 రోజుల పాటు ఇక్కడి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.