Ambareesh: సుమలత, నిఖిల్ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తత నడుమ మాండ్య పోలింగ్

  • అంబరీష్ మరణంతో రాజకీయాల్లోకి సుమలత
  • స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య నుంచి పోటీ
  • జేడీఎస్ అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి
  • మాటామాటా పెరగడంతో ఘర్షణ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రెండో దశ పోలింగ్ కొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. కర్ణాటకలోని మాండ్యలో సుమలత, నిఖిల్ కుమారస్వామి వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. భర్త అంబరీష్ మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ బరిలోకి దిగారు.

జేడీఎస్ తరుపున సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీకి దిగారు. అయితే మాండ్యలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద సుమలత, నిఖిల్ వర్గీయులు పరస్పరం తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.
Ambareesh
Sumalatha
Nikhil
Kumara Swamy
Mandya

More Telugu News