Thailand: మహాసముద్రంలో 220 కిలోమీటర్లు ఈతకొట్టి ప్రాణాలు కాపాడుకున్న కుక్కపిల్ల!

  • థాయ్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన కుక్కపిల్ల
  • ఈదుకుంటూ ఆయిల్ రిగ్ వరకూ
  • కాపాడిన రిగ్ ఉద్యోగి రితిసాక్

చూడటానికి ముద్దుగా, అమాయకంగా ఉన్న చిన్న కుక్కపిల్ల అది. కానీ దానికున్న పట్టుదల, అది చేసిన సాహసం ఏంటో తెలుసుకుంటే, ముక్కున వేలేసుకోవాల్సిందే. సముద్రంలో అది సుమారు 220 కిలోమీటర్ల దూరాన్ని ఈదింది. థాయ్ లాండ్ సముద్రతీరం నుంచి ఎలా వెళ్లిందో ఏమోగానీ, నీటిలోపలికి వెళ్లిపోయిన ఆ శునకం, బయటకు ఈదాల్సింది పోయి, లోపలికి ఈదింది.

 ఒడ్డు ఎటువైపుందో కనిపించక ఈదుకుంటూనే వెళ్లిపోయింది. అలా వెళ్లి, వెళ్లి, తీరానికి 220 కి.మీ. దూరంలో ఉన్న ఓ ఆయిల్‌ రిగ్‌ను చేరుకుంది. కష్టపడి దానిపైకి ఎక్కింది. అప్పటికే అది ఎంతో అలసిపోయివుంది. శరీరంపై గాయాలు ఉన్నాయి. కనీసం అరిచే శక్తి కూడా దానికి లేదు.

ఇక ఇదే రిగ్ లో పని చేస్తున్న రితిసాక్ అనే ఉద్యోగి, దాన్ని చూశాడు. అమాయకంగా చూస్తున్న దాన్ని రక్షించి, ఆహారం, నీళ్లు ఇచ్చాడు. దానికి బూన్ రోడ్ (థాయ్ భాషలో కర్మను గెలిచి బతికిన వారు) అని పేరు పెట్టాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాన్ని తానే పెంచుకుంటానని చెబుతూ, మొత్తం విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News