Karnataka: ఇంజనీరింగ్ యువతిపై అత్యాచారం.. సూసైడ్ లెటర్ రాయించి కిరాతకంగా హత్య!

  • కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఘటన
  • యువతిని చెట్టుకు ఉరివేసి చంపిన నిందితుడు
  • ఆందోళనకు దిగిన స్థానికులు, యువత
కర్ణాటకలోని రాయచూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంజనీరింగ్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగుడు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిందితుడు సుదర్శన్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాయచూర్ లోని నవోదయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతి కొన్నిరోజుల క్రితం అదృశ్యమయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచూర్ లోని మానిక్ ప్రభు ఆలయం వద్ద ఓ యువతి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు.. చనిపోయిన అమ్మాయి.. అదృశ్యమైన అమ్మాయి ఒక్కరేనని తేల్చారు.

తొలుత ఈ యువతిని కిడ్నాప్ చేసిన అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడనీ, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టాడని పోలీసులు తెలిపారు. చివరగా యువతి చేత ఆత్మహత్య లేఖ రాయించి ఆమెను ఉరివేసి చంపేశాడని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Karnataka
raichur
rape and murder
engineering student

More Telugu News