kumaraswamy: అంత అవసరం నాకు లేదు: మోదీపై కుమారస్వామి ఫైర్
- దేశ భక్తి గురించి మోదీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు
- నాపై దేశ వ్యతిరేక ముద్ర వేసే హక్కు మోదీకి లేదు
- టీ అమ్మి బీజేపీని ధనిక పార్టీగా మార్చారా?
తాను దేశభక్తుడిని కాదని ప్రధాని మోదీ అంటున్నారని... దేశభక్తి గురించి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో జమ్ముకశ్మీర్ లో ఒక్క పేలుడు కూడా సంభవించలేదని గుర్తు చేశారు.
తనపై దేశ వ్యతిరేక ముద్ర వేసే నైతిక అర్హత మోదీకి లేదని అన్నారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని నడుపుతామని మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దేశమంతా టీ అమ్మడం ద్వారానే బీజేపీని ధనిక పార్టీగా మోదీ మార్చారా? అని ఎద్దేవా చేశారు.
కర్వార్ లోని ఓ బీజేపీ నేత వద్ద నుంచి సుమారు రూ. 78 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని... ఈ డబ్బంతా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని కుమారస్వామి ప్రశ్నించారు.