GodavariUS: ప్రెస్ నోట్: “వాంగ‌” - గోదావ‌రి ఆధ్వ‌ర్యంలో విశిష్ట‌మైన డౌన్‌టౌన్ కాన్సెప్ట్‌

.


ప్రెస్ నోట్: వేగంగా వృద్ధి చెందుతున్న రెస్టారెంట్ గ్రూప్ “గోదావ‌రి” డౌన్‌టౌన్ ఆహార ప్రియుల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా “వాంగ‌ - ఏ క్రేజీ ఇండియ‌న్ జ‌యింట్” పేరుతో విశిష్ట సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. డౌన్‌టౌన్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా కార్పొరేట్ ప్ర‌జ‌ల యొక్కఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా దీనిని ప్ర‌త్యేకంగా రూపొందించారు. విశేష‌మైన స్పంద‌న‌తో తొలి కేంద్రం “డౌన్‌టౌన్ బోస్ట‌న్‌” ను ప్రారంభించుకున్నారు.
 
విశిష్ట‌మైన కాన్సెప్ట్‌తో రూపొందిన వాంగ దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సేవ‌లు అందిస్తోంది. క్రేజీ కాంబోలు (Crazy Combos), దేశీ టాకోస్ (DESI Tacos), దేశీ బౌల్స్‌ (DESI Bowls), బేరిట్టోస్ (BAE-rittos), స‌మోస బ‌ర్గ‌ర్లు (Samosa Burgers)వంటివెన్నో ... ఏ ఇత‌ర భార‌తీయ ప్ర‌దేశాల్లో దొర‌క‌నివి అతిథుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
 
“గోదావ‌రిని న‌డిపిస్తున్న వారి కృషి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. పెద్ద ఎత్తున ఉత్ప‌త్తులు అందుబాటులో ఉండేందుకు వారు ఎల్ల‌ప్పుడూ శ్రమిస్తుంటారు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో నూత‌న కేంద్రాల‌ను తెరిచేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతూ భార‌తీయ ఆహారాన్ని (Indian Food in American Style) ఈ మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. బోట్స‌న్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన నాటి నుంచి వారిని గ‌మ‌నిస్తున్నాను. నేడు వారు ప్ర‌పంచంలోనే అతి పెద్ద బ్రాండ్లుగా ఎదిగారు. ఈ యువ బృందం యొక్క స్ఫూర్తిని నేనుఇష్ట‌ప‌డుతున్నాను.” అని గోదావ‌రి వృద్ధిని స‌న్నిహితంగా వీక్షిస్తున్న‌ మ‌నోజ్ చ‌లువాది మ‌రియు శీత‌ల్ అరోరా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.
 
“టీం” గోదావ‌రి మ‌రిన్ని నూత‌న కేంద్రాల్లో త‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. టోరంటో, కెన‌డా, నాప‌ర్‌విల్లే, ఇలినాయిస్‌తో పాటుగా అమెరికా మ‌రియు కెన‌డాలోని ఇత‌ర న‌గ‌రాల్లో కేంద్రాల‌ను అందుబాటులో తేనుంది.
 
వాంగ (Indian Food in Downtown)లో అనేక ర‌కాలైన కాంబోలు అందుబాటులో ఉన్నాయి. ష‌కీలా పేరుతో కూడా కొన్ని ఉత్పత్తులు ఉండ‌గా...శ్రీ‌దేవి మ‌రియు స‌న్నీలియోన్ పేరుతో ఉన్నవి స్థానికులకు ఇష్ట‌మైన‌విగా నిలిచాయి.
 
వాంగ యొక్క ఇంటీరియ‌ర్ మ‌రియు ఫుడ్ మెనూ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి (Vaanga Interiors & Food).
 
“వాంగ కాన్సెప్ట్ ను దేశంలోని ఏ డౌన్‌టౌన్‌లో అయినా ఫ్రాంచైజీ రూపంలో తెరిచేందుకు మ‌రియు ఉత్త‌మ‌మైన వ్యాపార విధానంతో భార‌తీయ రుచుల ఆధారంగా మేం సాధించిన విశేష‌మైన అనుభ‌వంతో ముందుకు సాగే వారితో క‌లిసేందుకు మేంసిద్ధంగా ఉన్నాం” అని “టీం” గోదావ‌రి త‌ర‌ఫున జ‌శ్వంత్‌రెడ్డి మ‌రియు ఉద‌య్ రెడ్డి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.
 
గోదావ‌రి నూత‌న బిర్యానీని ఈ ఏడాది వేస‌వి కాలంలో “బిర్యానీ 2.0” పేరుతో ప్రవేశ‌పెట్ట‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు మీరు ఇలాంటి బిర్యానీని రుచి చూసి ఉండ‌ని విధంగా “బిర్యానీ 2.0” నిలుస్తుంది.
 
“గోదావ‌రి ఫుడ్ ఫ్యాక్ట‌రీ” కృషి ఫ‌లితంగా ప్ర‌స్తుతం పిల‌వ‌బ‌డుతున్న ఈ “ప‌నీర్” (ది మాల్ కాన్సెప్ట్‌), “వాంగ‌”  (క్రేజీ ఇండియన్ జాయింట్ ), “కిరాక్‌” (మోడ‌ర్న్ ఇండియ‌న్ క్యిజిన్‌) వంటి బ్రాండ్ల‌తో పాటుగా మ‌రిన్ని నూత‌న బ్రాండ్లు సైతం అందుబాటులోకిరానున్నాయి.
 
వాంగ ఫ్రాంచైజీ కోసం సంప్ర‌దించండి:
జ‌శ్వంత్ రెడ్డి
269-873-8733
[email protected] 
 
వాంగ‌లో రుచులు ఆరగించేందుకు విచ్చేయండి:
 
వాంగ బోస్ట‌న్ (Vaanga Boston)
102 వాట‌ర్ స్ట్రీట్‌,
బోస్ట‌న్, ఎంఏ 02190
ఫోన్‌: 617-624-0300
 
www.Vaanga.US 
 
Press release by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News