somireddy: బీజేపీలో ఉన్నవారు తప్ప మరెవరూ వ్యాపారాలు చేసుకోవద్దా?: సోమిరెడ్డి

  • చంద్రబాబు సమీక్షలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది
  • మోదీ, కేసీఆర్ లకు ఇవి వర్తించవా?
  • 72 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన ఈసీని చూడలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మోదీ, రాజ్ నాథ్ సింగ్, కేసీఆర్ లకు ఇవి వర్తించవా? అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించవచ్చని ఈసీ చెబుతోందని అన్నారు. చంద్రబాబు పేరు వింటేనే మోదీకి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఉన్నవారు తప్ప మరెవరూ వ్యాపారాలు చేసుకోవద్దా? అని ప్రశ్నించారు.
 
మోదీ, కేసీఆర్ అండతో వైసీపీ నేతలు ఏపీలో కోట్లాది రూపాయలను పంచిపెట్టారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఏపీ ఎన్నికలు ఈసీకి ఒక మాయని మచ్చలా మిగిలిపోతాయని చెప్పారు. 72 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన ఈసీని చూడలేదని అన్నారు. వీవీప్యాట్లను లెక్కించేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ఏకపక్షంగా అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఉంటుందా? అని అడిగారు.

  • Loading...

More Telugu News