srilanka: కొలంబోలో మళ్లీ పేలుళ్లు.. ఇద్దరి మృతి.. కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం!

  • దేహివాలాజ్ సమీపంలో బాంబు పేలుడు
  • బాంబు పేలుళ్ల ఘటనలో 250 పైగా మృతులు
  • 300కు పైగా క్షతగాత్రులు

శ్రీలంకలోని మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో ఈరోజు  ఉదయం పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, కొలంబోలో మరోమారు పేలుడు సంభవించింది. స్థానిక దేహివాలాజ్ సమీపంలో బాంబు పేలడంతో ఇద్దరు మృతి చెందారు. కాగా, శ్రీలంకలో తాజా ఘటనతో సహా ఉదయం జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 250. మూడు వందలకు పైగా గాయాల పాలయ్యారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులు ఉన్నారు.

 ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉండటంతో వారికి చెందిన గ్రూప్ రక్తం ఎక్కించడం కష్టంగా మారింది. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లలో రక్తం నిల్వలు లేకపోవడంతో క్షతగాత్రులకు రక్తం ఎక్కించడం సాధ్యపడక పలువురు మృతి చెందారు. ఇదిలా ఉండగా,ఈ ఘటనతో శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఈరోజు నుంచి రేపు సాయంత్రం వరకూ కర్ఫ్యూ  కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కొలంబోలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. రెండ్రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

  • Loading...

More Telugu News