Sri Lanka: కొలంబో ఘటన: టూరిస్టు రూపంలో చర్చిలో ప్రవేశించింది ఐసిస్ ఉగ్రవాదే!
- దాడులు ఐసిస్ పనే అని నమ్ముతున్న శ్రీలంక!
- తమను తాము పేల్చేసుకున్న ఉగ్రవాదులు
- దేశవ్యాప్తంగా హైఅలర్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ సందర్భంగా చోటుచేసుకున్న పేలుళ్లు ఐసిస్ ఉగ్రవాదుల పనేనని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. ఐసిస్ శ్రీలంక మాడ్యూల్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులే చర్చిల్లో, హోటళ్లలో పేలుళ్లకు కారకులని నమ్ముతున్నట్టు శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బట్టికలోవా ప్రాంతంలోని చర్చిలోకి అబు మహ్మద్ అనే ఉగ్రవాది పర్యాటకుడి రూపంలో వెళ్లి ఆత్మాహుతికి పాల్పడినట్టు గుర్తించారు. జహ్రాయిన్ అనే మరో ఆత్మాహుతి దళ సభ్యుడు షాంగ్రీలా హోటల్ లో తనను తాను పేల్చుకున్నట్టు తెలిసింది. వీరిద్దరూ ఐసిస్ దళ సభ్యులేనని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. దాడుల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు.