Sri Lanka: 'ఏసుక్రీస్తు'పైనా రక్తం చిందింది! శ్రీలంక దాడుల తీవ్రతకు అద్దం పడుతున్న ఫొటో ఇది!
- నెత్తురోడిన చర్చిలు
- ఈస్టర్ రోజున తీవ్ర విషాదం
- శోకసంద్రంలా మారిన కొలంబో
ప్రకృతి అందాలకు పెట్టిందిపేరైన శ్రీలంకలో కనీవినీ ఎరుగని రీతిలో నరమేధం జరిగింది. ఐసిస్ ఉగ్రవాదులుగా భావిస్తున్న ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 180 మందికి పైగా మరణించగా, 450 మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే, చర్చిల్లో ఎంతో శక్తిమంతమైన బాంబులతో పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం కూడా రక్తసిక్తమైపోయింది. భక్తుల తాలూకు రక్తం, మాంస ఖండాలు ఎగిరివచ్చి ఏసు విగ్రహంపై పడ్డాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రార్థనమందిరాలు ఇప్పుడు నెత్తురోడాయి. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, ఛిద్రమైన శరీర అవయవాలు దర్శనమిస్తున్నాయి.