India: శ్రీలంక ఎఫెక్ట్: బంగాళాఖాతంలో యుద్ధనౌకలు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్టులను మోహరించిన భారత్
- సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం
- ఇప్పటికే హెచ్చరికలు చేసిన నిఘా వర్గాలు
- అన్ని విధాలుగా సన్నద్ధమైన కోస్ట్ గార్డ్
శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ తీర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్ లో ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతంలో యుద్ధనౌకలు మోహరించారు. అంతేకాదు, కీలకమైన డోర్నియర్ నిఘా విమానాలను కూడా భారత తీరప్రాంత రక్షక దళం సిద్ధం చేసింది. ఆత్మాహుతి దాడులను అడ్డుకునేందుకు కోస్ట్ గార్డ్ అన్ని విధాలుగా సన్నద్ధమైంది. కాగా, శ్రీలంకలో ఈ అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధించనున్నారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటన చేస్తారు.