Telangana: ఇంటర్ వివాదాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు!: మంత్రి జగదీశ్ రెడ్డి

  • ఈ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ
  • త్వరలో కమిటీ నివేదిక వస్తుంది
  • దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం

తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంలో కొంత మంది రాజకీయ లబ్ధి కోసం సమస్యను వివాదాస్పదం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ వ్యవహారంపై తాము నియమించిన కమిటీ త్వరలో నివేదిక సమర్పిస్తుందనీ, అప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కొందరు చేస్తున్న రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబరినీ ప్రైవేట్ లిమిటెడ్ ఐటీ సొల్యూషన్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ మానవ తప్పిదమని తేలితే ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తేల్చిచెప్పారు. ఫలితాలపై అనుమానాలు ఉన్నవారు మరోసారి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News