Telangana: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన సినీ నటుడు రామ్

  • విద్యార్థుల ఆత్మహత్యలను ఇంటర్ బోర్డు హత్యలుగా అభివర్ణించిన రామ్
  • తానసలు ఇంటర్ చదవనేలేదన్న నటుడు
  • ఎవరో చేసిన పొరపాటుకు విద్యార్థులు బలవుతున్నారన్న దర్శకుడు మారుతి

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ పోతినేని స్పందించాడు. ఇంటర్‌ను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నాడు. ఇంటర్ పాసవడమే జీవితం అనుకుంటే, తానసలు ఇంటరే పూర్తిచేయలేదన్నాడు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ఇంటర్ బోర్డు హత్యలుగా అభివర్ణించిన రామ్.. జీవితంలో అవబోయేదానికి, చేయబోయేదానికి ఇంటర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని, ఆ మాటకొస్తే తానసలు ఇంటరే పూర్తిచేయలేదని పేర్కొన్నాడు.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై టాలీవుడ్ దర్శకుడు మారుతి కూడా స్పందించాడు. పరీక్షలు మనలోని నైపుణ్యాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవని, తాను చదువులో యావరేజ్ స్టూడెంట్‌నని పేర్కొన్నాడు. అయితే, యానిమేషన్‌లో మాత్రం తాను టాపర్‌నని గుర్తు చేసుకున్నాడు. తాను చదవిన చదువు తనను దర్శకుడిగా మార్చలేదన్నాడు. సినిమాలపై తనకున్న అభిరుచే ఇటువైపు నడిపించిందన్నాడు. కాబట్టి ఫెయిలయ్యామన్న కారణంతో ప్రాణాలు తీసుకోవద్దని సూచించాడు. ఎవరో చేసిన పొరపాటుకు బలికావద్దన్నాడు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పరీక్షల పేరుతో ఒత్తిడి తీసుకురావొద్దని సూచించాడు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.

  • Loading...

More Telugu News