Low Preasure: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలో భారీ వర్షాలకు అవకాశం!
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రేపటికి వాయుగుండంగా మారే చాన్స్
- తమిళనాడు, పుదుచ్చేరికి భారీ వర్ష సూచన
బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మధ్య ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఇది మరింతగా బలోపేతమై చెన్నై వైపు రానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. ఇదిలావుండగా, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం నాడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిశాయి.