vvpat: వీవీప్యాట్ పై వెనక్కి తగ్గని ప్రతిపక్షాలు.. మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు!
- 50 శాతం వీవీప్యాట్లు లెక్కింపునకు కాంగ్రెస్, టీడీపీ పట్టు
- రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన 21 ప్రతిపక్ష పార్టీలు
- గతంలో పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వీవీప్యాట్ యంత్రాల వ్యవహారంలో టీడీపీ, కాంగ్రెస్ సహా 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈవీఎంల్లో పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చేలా ఆదేశించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తేనే ఈవీఎంల పనితీరు, పారదర్శకతపై స్పష్టత వస్తుందని చెప్పాయి.
గతంలో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం ప్రతీ లోక్ సభ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు వీవీప్యాట్ల చొప్పున లెక్కించాలని ఆదేశించింది. అయితే దీనిపై సంతృప్తి చెందని పార్టీలు మరోసారి అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాయి.