sensex: మూడు రోజుల నష్టాలకు ముగింపు.. దూసుకుపోయిన సెన్సెక్స్
- 490 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 150 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- దాదాపు మూడున్నర శాతం లాభపడ్డ హెచ్సీఎల్
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఎనర్జీ స్టాకుల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నిస్తేజంగా ఉన్న మార్కెట్లు చివరి గంటల్లో కొనుగోళ్ల ఊపుతో ఒక్కసారిగా లాభాల్లోకి ఎగబాకాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 490 పాయింట్లు పెరిగి 39,055కు చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 11,726కు పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.40%), ఓఎన్జీసీ (2.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.75%), యస్ బ్యాంక్ (2.71%), భారతి ఎయిర్ టెల్ (2.62%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-3.33%), హీరో మోటోకార్ప్ (-0.60%), కోల్ ఇండియా (-0.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.42%), మారుతి సుజుకి (-0.26%).