Telangana: ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవు: ప్రొఫెసర్ నాగేశ్వర్
- వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం చేస్తారు
- రాజకీయ అవినీతి పోకుండా ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యం
- అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయతీ ఉండాలి
వ్యవస్థ మారనంత కాలం అధికారులపై రాజకీయ నేతలు పెత్తనం చేస్తారని, ఉద్యోగుల పని సంస్కృతి మారకపోతే ఇబ్బందులు తప్పవని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో రెవెన్యూ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రెవెన్యూ సంస్కరణలు- సమస్యలు-సూచనలు’ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో నాగేశ్వర్, ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ, ప్రజలు, ఉద్యోగులకు ఘర్షణ వస్తే, ప్రభుత్వ మనుగడ కష్టమని అన్నారు. రాజకీయ అవినీతి పోకుండా, ఉద్యోగుల అవినీతి నిర్మూలన అసాధ్యమని అన్నారు. అవినీతి ఆగాలంటే వ్యక్తిగత నిజాయతీ ఉండాలని, హితబోధ జరగాలని, ముందుగా రాజకీయ అవినీతిని అంతం చేయాలని అభిప్రాయపడ్డారు.