sadhvi pragya: వారం రోజుల్లో మూడో నోటీసు అందుకున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్

  • దిగ్విజయ్ సింగ్ ను ఉగ్రవాది అన్న ప్రజ్ఞాసింగ్
  • ఉగ్రవాదిని సన్యాసిని చంపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ
బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ పై ఈసీ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను తీవ్రవాదిగా ఆమె వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నోటీసులు జారీ చేసింది. గత వారం రోజుల్లో ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేయడం ఇది మూడో సారి. ఓ ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ ఓ ఉగ్రవాదిని ఒక సన్యాసిని చంపాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ... సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. 
sadhvi pragya
bjp
digvijay singh
congress
ec

More Telugu News