Bus: బస్సులో కోడికి టికెట్ కొనలేదని జరిమానా విధించిన కర్ణాటక ఆర్టీసీ!
- జంతువులు, పక్షులను తీసుకెళ్తే టికెట్ కొనాల్సిందే
- నిబంధనలు తెలియక బస్సెక్కిన వ్యక్తి
- రూ. 500 జరిమానా వసూలు
బస్సులో తనతో పాటు తీసుకువస్తున్న మూడు కోళ్లకూ టికెట్ కొనలేదన్న కారణంతో కర్ణాటక ఆర్టీసీ అధికారులు ఓ వ్యక్తికి రూ. 500 జరిమానా విధించారు. కేఎస్ ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకు వెళ్లాల్సి వస్తే, విధిగా అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి, మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. తనైతే టికెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. బస్సు కాస్త దూరం వెళ్లిన తరువాత తనిఖీ బృందం బస్సును ఆపింది. తనిఖీల్లో భాగంగా సదరు వ్యక్తి వద్ద కోళ్లు ఉన్నట్టు గుర్తించి, జరిమానా విధించారు. దీంతో చేసేదేమీ లేక రూ. 500 చెల్లించాడా వ్యక్తి.