terrarists: తమిళనాడులోని రామాంతపూర్‌లోకి ప్రవేశించిన 19 మంది ఉగ్రవాదులు.. హై అలర్ట్‌!

  • వరుస పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని ఐబీ హెచ్చరిక
  • ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ముఖ్యంగా బెంగళూరు, మైసూరు నగరాలు లక్ష్యమని అనుమానం

ద్వీప దేశం శ్రీలంకలో వరుస పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన ఉగ్రమూకలు అటువంటి బీభత్సాన్ని మన దేశంలో కూడా సృష్టించేందుకు సముద్ర మార్గం గుండా భారత్‌లోకి ప్రవేశించారని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. మొత్తం 19 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంలో ప్రయాణించి తమిళనాడు రాష్ట్రం రామాంతపూర్‌ వద్ద భారత్‌ భూభాగంలోకి అడుగుపెట్టారని ఐబీ పేర్కొంది. వీరు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 19 చోట్ల పేలుళ్లకు కుట్రపన్నారని ఐబీ తన హెచ్చరికల్లో తెలిపింది. అందువల్ల ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాగా, ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం కర్ణాటక రాజధాని బెంగళూరు, చారిత్రక పర్యాటక ప్రాంతం మైసూరు నగరాలని ఓ లారీ డ్రైవర్‌ సమాచారం అందించినట్టు కర్ణాటక డీజీపీ  దక్షిణాది రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, రద్దీ ప్రదేశాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News